ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 7:35 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు న్యాయం చేయండి సీఎం రేవంత్ కు ఎంప మల్లు రవి విజ్ఞప్తి

నాగర్కర్నూల్,అర్జున్ సమాచారం:
ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఒగ్గు పర్వతాలు కలిసారు.
ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ మోసాలకు గురైన బాధితుల పక్షాన ఒగ్గు పర్వతాలు  ముఖ్యమంత్రిని కలిసి బాధితుల సమస్యలను,జరిగిన మోసాల వివరాలను పూర్తిగా వివరించారు. ఈ సందర్భంగా మోసాలకు పాల్పడిన వారి ఆస్తులు, భూములను వెంటనే జప్తు చేసి,బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు.ముఖ్యంగా పేద రైతులు,సామాన్య ప్రజలు తమ జీవితకాల డబ్బులను కోల్పోయినందున ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా.మల్లు రవి  కూడా పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఒగ్గు పర్వతాలు స్పష్టం చేశారు.
========================